ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump: భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
Donald Trump: భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. బ్రిటన్ పర్యటనలో ప్రధాని స్టార్మర్‌కు తెలియజేశారు. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని ఆపలేకపోవడం తనను బాగా నిరాశ పరిచిందని వెల్లడించారు. ప్రధాని మోడీ తన సన్నిహిత స్నేహితుడే అయినా.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం వల్ల అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందని తెలిపారు. సుంకాలవల్ల రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయకపోతే ధరలు దిగి వస్తాయని ట్రంప్ వెల్లడించారు.