Thailand Train Accident: రైలుపై జారిపడిన క్రేన్‌.. 22 మంది మృతి

Thailand Train Accident: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై ఓ భారీ క్రేన్ జారిపడటంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి.

Update: 2026-01-14 07:30 GMT

Thailand Train Accident: రైలుపై జారిపడిన క్రేన్‌.. 22 మంది మృతి

Thailand Train Accident: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై ఓ భారీ క్రేన్ జారిపడటంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందినట్లు, 30 మందికిపైగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనుల్లో భాగంగా ఉపయోగిస్తున్న ఓ క్రేన్ అదుపుతప్పి కింద పడింది. అదే సమయంలో పట్టాలపై ప్రయాణికుల రైలు వెళ్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది.

క్రేన్ రైలుపై పడటంతో పలువురు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు కూడా చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News