Donald Trump: పాక్, భారత్ మధ్య యుద్ధం జరగకుండా ఆపినందుకు.. ట్రంప్‌కు పాకిస్తాన్ నోబెల్ ప్రైజ్..

Update: 2025-06-21 08:31 GMT

Donald Trump: పాక్, భారత్ మధ్య యుద్ధం జరగకుండా ఆపినందుకు.. ట్రంప్‌కు పాకిస్తాన్ నోబెల్ ప్రైజ్..

Donald Trump: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇటు ఇండియా, అటు పాకిస్తాన్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులను చాలా తెలివిగా, సామరస్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చక్కదిద్దారని, అందుకు ఆయనకు పాకిస్తాన్ ప్రభుత్వం నోబెల్ బహుమతి ప్రకటించింది. విచిత్రమేంటంటే.. పహల్గామ్ దాడి తర్వాతగానీ, ఏ ఇతర దాడుల తర్వాతగానీ ఏ దేశం మధ్యవర్తిత్వాన్ని తీసుకోలేదని భారత్ గట్టిగా చెప్పిన తర్వాతే పాక్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం విశేషం.

పహల్గామ్ దాడి తర్వాత పాక్, భారత్ దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు జరిపాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు దేశాల మద్య యుద్ధం జరుగుతుందనే అందరూ అనుకున్నారు. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. అయితే రెండు దేశాల దౌత్య చర్చలతోనే ఈ కాల్పుల విరమణ జరిగిందని భారత్ అప్పట్లోనే స్పష్టం చేసింది. అంతేకాదు, ఇటీవల డోనాల్ట్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో ఏఇతర దేశం పాత్య లేదని, ఏ ఇతర దేశాల మధ్యవర్తిత్వం లేదని మోదీ తెలిపారు. ఆ తర్వాత, ట్రంప్‌ కూడా ఇండియా, పాక్ మధ్యలో తాను ఎప్పుడూ వెళ్లలేదని, మధ్యవర్తిత్వాన్ని చేయలేదనే ప్రకటనను కూడా విడుదల చేశారు.

ఇదిలాఉంటే ఇప్పుడు పాక్, భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం జరగకుండా ఆపడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించాడని చెబుతోంది. అంతేకాదు, ఇస్లామాబాద్, న్యూఢిల్లీ ఈ రెండింటినీ కలపడంలో ట్రంప్ వ్యూహాత్మకంగా, అద్బుతమైన రాజనీతిని ప్రధరించాని అంటోంది. ట్రంప్ ప్రయత్నం చేయడం వల్లే కాల్పుల విరమణ జరిగిందని పేర్కోంది. అందుకే తమ దేశం ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలనుకుంటోందని ఒక ప్రకటనలో వెల్లడించింది.

Tags:    

Similar News