ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ ను హతమార్చిన అమెరికా?

Update: 2019-08-01 05:57 GMT

అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో ప్రపంచాన్ని గడగడ లాడించిన ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా హతమార్చిన సంగతి తెల్సిందే. అయితే, ఇప్పుడు లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్‌ను కూడా అమెరికా మట్టుపెట్టిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన మీడియా సంస్థ ఎన్బీసీ తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు కూడా ధృవీకరించారని ఆ సంస్థ పేర్కొంది.

హమ్జా బిన్ లాడెన్‌ అల్-ఖైదా సంస్థకు వారసుడిగా ఉన్నారు. రెండేళ్లుగా ఇతని కోసం అమెరికా ఆపరేషన్ నిర్వహిస్తోంది. 2017లో హమ్జా బిన్ లాడెన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా, అతనిపై ఒక మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. బిన్ లాడెన్ కు మొత్తం 20 మంది పిల్లలు. వారిలో హమ్జా 15వ వాడు.


Tags:    

Similar News