Nepal Gen-Z Protest: ఆందోళనలతో వెనక్కి తగ్గిన నేపాల్ ప్రభుత్వం.. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం
Nepal Gen-Z Protest: నేపాల్ లో సొషల్ మీడియాపై బ్యాన్ పై చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Nepal Gen-Z Protest: ఆందోళనలతో వెనక్కి తగ్గిన నేపాల్ ప్రభుత్వం.. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం
Nepal Gen-Z Protest: నేపాల్ లో సొషల్ మీడియాపై బ్యాన్ పై చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధం ఎత్తివేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో క్యాబినెట్ అత్యవసర భేటీ నిర్వహించి..సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేసింది. ఈ సమావేశం అనంతరం ఆ దేశ కమ్యూనికేషన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేశారు.
జనరేషన్ జడ్ డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో ఫేస్‌బుక్, ఎక్స్ , వాట్సప్ తదితర సైట్లు పనిచేయడం ప్రారంభించాయి. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించాలని మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ కోరారు.