Jaishankar: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పై దాడికి యత్నించిన ఖలిస్తానీ మద్దతుదారులు

Update: 2025-03-06 03:38 GMT

Jaishankar

Jaishankar: భారత విదేశాంగ శాఖ మంత్రి లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆయన పర్యటనకు అంతరాయం కలిగించే విధంగా ఖలిస్థానీ అతివాదులు దాడికి పాల్పడ్డారు. ఓ దుండగుడు ఏకంగా జైశంకర్ కారు దగ్గరకు అత్యంత సమీపంగా దూసుకువచ్చాడు. లండన్ లోని ఛాఠమ్ హౌస్ లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని జైశంకర్ బయటకు వచ్చారు. ఈ సమయంలో కొంతమంది ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం రేపారు. తమ జెండాలతో నిరసనకు దిగారు. ఆ సయమంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు దగ్గరకు దూసుకువచ్చాడు. అతని చేతిలో భారతీయ జెండా ఉండగా దాన్ని అవమానించే విధంగా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు మిగతా ఆందోళనకారులను అక్కడినుంచి తరిమి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News