Middle East Crisis Updates: మధ్యప్రాచ్యంలో యుద్ధం.. పాకిస్తాన్ ఉన్నతస్థాయి సమావేశం

Middle East Crisis Updates: మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతున్న వేళ పాకిస్థాన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు.

Update: 2026-03-29 05:05 GMT

Middle East Crisis Updates

Middle East Crisis Updates: మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇటు ఇరాన్.. అటు అమెరికా, ఇజ్రాయేల్ ఎవరికీ వారు తగ్గేది లేదంటూ రెచ్చిపోతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏమవుతుందో అనే భయంతో ప్రపంచ దేశాలు బిక్కు, బిక్కు మంటున్నాయి. యుద్ధాన్ని ఆపగలిగే ఏ అవకాశమైనా ఉంటుందా? అనే వెతుకులాటలో పడ్డాయి. కానీ, రెండు పక్షాల మధ్య రాజీకోసం ఎవరు ప్రయత్నిస్తారు అనే పెద్ద ప్రశ్న.. దానికి సమాధానం అన్నట్టు కొన్నిరోజులుగా పాకిస్తాన్ నేను యుద్ధంలో రాజీకి ప్రయత్నిస్తున్నాను అంటూ చెబుతూ వస్తోంది. ఆ దిశలో కొన్ని పరిణామాలు కూడా కనిపించాయి. కానీ, ఫలితం కనిపించలేదు.

ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్య యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనేందుకు పాకిస్థాన్ ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం ఇస్లామాబాద్‌లో జరగబోతోంది. యుద్ధ పరిస్థితిలో మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ తీసుకుంటున్న కొత్త చర్యలలో భాగంగా ఈ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ రెండు రోజుల సమావేశంలో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొంటున్నారు.

పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెష్మెర్గాతో కూడా చర్చలు జరిపినట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ చర్చలకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ చర్చల కోసం సౌదీ అరేబియా యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, టర్కీ అధ్యక్షుడు హకాన్ ఫిదాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు బదర్ అబ్దుల్లాహి ఇస్లామాబాద్‌లో ఉన్నారు.

ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలతో సహా పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చల్లో పాల్గొంటారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ, అధికారికంగా వాటిపై క్లారిటీ రాలేదు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత వంటి సమస్యలతో పాకిస్తాన్ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో ఆ దేశమే ఈ చర్చలు జరిపేందుకు చొరవ తీసుకుంటోంది. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సమావేశం పాకిస్థాన్‌లో ఎందుకు?

పాకిస్తాన్‌కు ఇరాన్, సౌదీ అరేబియా రెండింటితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, అందువల్ల విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్‌ను అనువైన ప్రదేశంగా పరిగణిస్తున్నారు. ఈ సమావేశాన్ని మొదట టర్కీలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, తర్వాత దానిని పాకిస్తాన్‌కు మార్చారు.

పాకిస్తాన్ ప్రస్తుతం ఏ పక్షంతోనూ ప్రత్యక్షంగా సంబంధం కలిగి లేదు, కాబట్టి దానిని తటస్థ వైఖరిలో ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఇరాన్, సౌదీ అరేబియా రెండింటితోనూ దానికి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇది చర్చలను సులభతరం చేస్తుంది. పాకిస్తాన్‌కు టర్కీ -ఈజిప్ట్ వంటి దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.

పాక్ నౌకలకు గ్రీన్ సిగ్నల్

హోర్ముజ్ జలసంధి గుండా పాకిస్తాన్ జెండా ఉన్న 20 నౌకలను వెళ్ళడానికి ఇరాన్ అనుమతించిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రతిరోజూ రెండు నౌకలు జలసంధిని దాటుతాయని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్ లో తెలిపారు.

రష్యా సహకరిస్తోంది

మరోవైపు మధ్యప్రాచ్యం - గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలను రష్యా పర్యవేక్షిస్తోందన్న నిఘా సమాచారం తనకు అందిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. కువైట్, సౌదీ అరేబియా, టర్కీ , ఖతార్‌లలోని అమెరికా, మధ్యప్రాచ్య, బ్రిటిష్ సైనిక స్థావరాలతో పాటు, హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా-బ్రిటిష్ సైనిక స్థావరంతో సహా ఏడు ప్రదేశాలను ఈ వారం పర్యవేక్షించడం లేదా చిత్రీకరించడం జరిగిందని ఆయన అన్నారు.

Tags:    

Similar News