Russia Petrol: పెట్రోల్ ఎగుమతులపై రష్యా నిషేధం.. భారత్ పరిస్థితి ఏమిటి?
Russia Petrol: రష్యా పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించాలని చూస్తోంది. క్రూడాయిల్ పై నిషేధం ఉండదు. దీని ప్రభావం భారత్ పై ఉంటుందా?
Russia Petrol
Russia Petrol: గ్యాసోలిన్ (పెట్రోల్-డీజిల్)ఎగుమతులను ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను నిర్ధారించుకోవడానికి రష్యా తన పెట్రోల్ ఎగుమతులను నిలిపివేయాలని యోచిస్తోంది. దీని అర్థం, ఏ రష్యన్ చమురు శుద్ధి కర్మాగారాలు కూడా విదేశాలకు పెట్రోల్ - డీజిల్‌ను ఎగుమతి చేయలేవు. రష్యా కేవలం పెట్రోల్, డీజిల్ ఎగుమతులను మాత్రమే నిలిపివేయాలని యోచిస్తోందని గమనించాలి. రష్యా ఈ నిర్ణయాన్ని చాలాసార్లు తీసుకుంది. అయితే, ముడి చమురు సరఫరాను మాత్రం ఆపడం లేదు. క్రోదాయి సరఫరా యథావిధిగా కొనసాగుతుంది.
భారత్ పరిస్థితి?
ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, పెట్రోలియం గ్యాస్ వంటి ఉత్పత్తులుగా తయారు చేస్తారు. మన దేశంలోని కొన్ని పెద్ద కంపెనీలు ముడి చమురును దిగుమతి చేసుకుని, దానిని పెట్రోల్, డీజిల్ వంటి వివిధ శుద్ధి చేసిన ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తాయి. ఇతర దేశాల నుండి పెట్రోల్‌ను నేరుగా దిగుమతి చేసుకోవడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది.
రష్యా రోజుకు 120,000 నుండి 170,000 బ్యారెళ్ల పెట్రోలియంను ఎగుమతి చేస్తుంది. ఎగుమతులను నిలిపివేస్తే, రష్యా చమురు ఉత్పత్తులకు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్న చైనా, టర్కీ, బ్రెజిల్, ఆఫ్రికా, సింగపూర్ వంటి దేశాలపై ప్రభావం పడవచ్చు. భారతదేశం పెట్రోలియం కాకుండా ముడి చమురును కొనుగోలు చేస్తుంది కాబట్టి, మనపై ప్రభావం తక్కువగా ఉంటుంది.
రోజుకు 56 లక్షల బ్యారెళ్ళు..
భారతీయ రిఫైనరీలు రోజుకు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటి నుండి ఉత్పత్తి అయ్యే పెట్రోల్, డీజిల్ భారత మార్కెట్‌కు సరిపోవడమే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా సరిపోతుంది. అత్యధిక సంఖ్యలో పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది.
అయితే, ఇరాన్ యుద్ధం, చమురు సంక్షోభం తర్వాత, భారతదేశం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులను దాదాపుగా నిలిపివేసి, దేశీయ మార్కెట్‌కు సరఫరా చేయడానికి దానిని ఉపయోగిస్తోంది. పెట్రోల్ ఎగుమతులపై రష్యా విధించిన నిషేధం భారతదేశాన్ని నేరుగా ప్రభావితం చేయనప్పటికీ, ఇది ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీయవచ్చు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలపై మరింత ఒత్తిడి పెరగవచ్చు.
హెర్మూజ్ దాటిన భారత్ ఎల్ఫీజీ నౌకలు . .
ఇదిలా ఉంటే, 94,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజిని తీసుకువెళ్తున్న రెండు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారతదేశం వైపు వస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ రెండు ట్యాంకర్లు ఈ వారంలో ముంబైకి చేరుకుంటాయని భావిస్తున్నారు. ఈ ట్యాంకర్లు దేశ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన సుమారు 94,000 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్‌ను తీసుకువెళ్తున్నాయి. ఇంతకుముందు నాలుగు భారత జెండా కలిగిన ఎల్‌పిజి ట్యాంకర్లు ఈ మార్గం గుండా ప్రయాణించగా, మరో మూడు ఇప్పటికీ జలసంధి పశ్చిమ భాగంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఇప్పటికీ 18 భారతీయ నౌకలు, 485 మంది భారతీయ నావికులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.