Saudi Arabia: సౌదీ అరేబియాలో 600 విమానాల ఆలస్యం.. చిక్కుకుపోయిన ప్రయాణీకులు

Saudi Arabia: సౌదీ అరేబియాలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా విమానాలు రద్దు చేశారు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

Update: 2026-03-29 14:01 GMT

Saudi Arabia

Saudi Arabia: సౌదీ అరేబియాలోని వివిధ విమానాశ్రయాలలో విమాన సేవలకు అంతరాయం కలగడంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు మీడియార్ రిపోర్టులు చెబుతున్నాయి. దేశంలోని ఐదు ప్రధాన విమానాశ్రయాలలో 604 విమానాలు ఆలస్యం కాగా, 63 విమానాలు రద్దయ్యాయి. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో అత్యధికంగా 249 విమానాలు ఆలస్యమయ్యాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ విమానాశ్రయంలో 29 విమానాలు రద్దయ్యాయి. దమ్మామ్, మదీనా, అల్-జౌఫ్ విమానాశ్రయాలలో కూడా ఇదే విధమైన సంక్షోభం నెలకొంది.

ఈ అంతరాయం వల్ల సౌదీ ఎయిర్‌లైన్స్ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. సౌదీకి చెందిన 219 విమానాలు ఆలస్యమవ్వగా, 25 రద్దయ్యాయి. ప్రభావితమైన ఇతర ప్రధాన విమానయాన సంస్థలలో ఫ్లైనాస్ (121 ఆలస్యాలు), ఫ్లైఅదీల్ (87 ఆలస్యాలు, గల్ఫ్ ఎయిర్ (22 రద్దులు) ఉన్నాయి. అల్-జౌఫ్ దేశీయ విమానాశ్రయంలో సర్వీసులు ఆలస్యం కానప్పటికీ, మొత్తం ఆరు విమానాలు రద్దయ్యాయి.

విమానాశ్రయాలకు వెళ్లే ముందు, ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థల వెబ్‌సైట్‌లు లేదా యాప్‌ల ద్వారా విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దయిన విమానాల్లోని ప్రయాణికులు తిరిగి బుకింగ్ చేసుకోవడం కోసం విమానయాన సంస్థ సహాయక విభాగాన్ని సంప్రదించాలి.

ఈ అంతరాయం వల్ల సౌదీ ఎయిర్‌లైన్స్ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. సౌదీకి చెందిన 219 విమానాలు ఆలస్యమవ్వగా, 25 రద్దయ్యాయి. ప్రభావితమైన ఇతర ప్రధాన విమానయాన సంస్థలలో ఫ్లైనాస్ (121 ఆలస్యాలు), ఫ్లైఅదీల్ (87 ఆలస్యాలు), గల్ఫ్ ఎయిర్ (22 రద్దులు) ఉన్నాయి. అల్-జౌఫ్ దేశీయ విమానాశ్రయంలో సర్వీసులు ఆలస్యం కానప్పటికీ, మొత్తం ఆరు విమానాలు రద్దయ్యాయి.

విమానాశ్రయాలకు వెళ్లే ముందు, ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థల వెబ్‌సైట్‌లు లేదా యాప్‌ల ద్వారా విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దయిన విమానాల్లోని ప్రయాణికులు తిరిగి బుకింగ్ చేసుకోవడం కోసం విమానయాన సంస్థ సహాయక విభాగాన్ని సంప్రదించాలి.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం సౌదీలో విమానాల ఆలస్యానికి కారణం తెలియరాలేదు. కానీ, యుద్ధ వాతావరణం కారణంగానే విమానాలు ఆలస్యం అవుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.



Tags:    

Similar News