Israel Strikes: హమాస్ నేతలపై ఖతార్‌లో ఇజ్రాయిల్ దాడి
Israel Strikes: గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు..
Israel Strikes: గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు.. ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ నేతలపై సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ దాడి చేసింది. హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడుతో సహా ఆరుగురు మృతి చెందారు.
ఈ దాడి తమ వైమానిక దళం చేసిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి అవిచయ్ అడ్రాయీ తెలిపారు. ప్రధాని నెతన్యాహూ కూడా దాడిని ధ్రువీకరించారు. హమాస్ ఉగ్రవాదులపై సొంతంగానే దాడి చేశామని తెలిపారు. అదనపు నిఘా సమాచారంతో కచ్చితమైన ఆయుధ సామగ్రిని దాడిలో వినియోగించామని ఇజ్రాయెల్ వెల్లడించింది.