Floods: సిడ్నీని వణికిస్తోన్న వరదలు
Floods: ఆకస్మిక వరదలతో సిడ్నీ చిగురుటాకులా వణికిపోతుంది.
Floods: సిడ్నీని వణికిస్తోన్న వరదలు
Floods: ఆకస్మిక వరదలతో సిడ్నీ చిగురుటాకులా వణికిపోతుంది. తూర్పు తీరంలో భారీ వర్షాలు కురవడంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. పలుచోట్ల వరదల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇక న్యూ సౌత్‌వేల్స్ లోనూ భారీ వర్షాలు, వరదలు రానున్నట్లు అధికారులు హెచ్చరించారు. మరోవైపు గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంపు భయంతో వణికిపోతున్నారు జనం.