ఇజ్రాయెల్, గాజా యుద్ధాన్ని ఆపడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు కొనసాగిస్తు్న్నారు. ఈ నేపథ్యంలోనే అరబ్, ముస్లిం దేశాధినేతలతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ట్రంప్ ఈ సమావేశాన్ని తన అధ్యక్ష పదవిలో అత్యంత ముఖ్యమైందిగా అభివర్ణించారు. తాము గాజా యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నామని అరబ్ దేశాధినేతలకు తెలిపారు ట్రంప్. అందుకు తమ సహకారం ఉంటుందని వివిధ దేశాధినేతలు మద్దతు పలికారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి.. ట్రంప్ నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని ఖతార్ నేత హమద్ అల్‌థాని విశ్వాసం వ్యక్తం చేశారు.