China: చైనాలో కరోనా ఉగ్రరూపం.. ఆస్పత్రుల్లో బెడ్లు ఫుల్

China: ఆస్పత్రుల కారిడార్లలోని బెంచీలపై నిద్రిస్తున్న కరోనా రోగులు

Update: 2022-12-26 06:53 GMT

China: చైనాలో కరోనా ఉగ్రరూపం.. ఆస్పత్రుల్లో బెడ్లు ఫుల్

China: చైనాలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. చైనాలోని హెబీలోని ఆస్పత్రుల్లో బెడ్లు ఫుల్ అయ్యాయి. దీంతో రోగులను హాస్పిటళ్లు తిప్పికొడుతున్నాయి. ఆస్పత్రి కారిడార్లలోని బెంచీలపై కరోనా రోగులు నిద్రిస్తున్నారు. కోవిడ్ ఉప్పెనపై చైనాలో ఆందోళన పెరుగుతోంది. కరోనా పెరుగుతుందని చైనా భయపడుతోంది. కోవిడ్ మరణాలను సున్నాగా నమోదు చేస్తోంది చైనా కానీ శ్మశానవాటికలన్నీ రద్దీగా ఉన్నాయి. ఇదంతా కోవిడ్ ఉప్పెన స్థాయిని సూచిస్తుందంటున్నారు నిపుణులు జువోజోలోని ఓ ఆస్పత్రిలో, ICU బెడ్లలో చాలా రద్దీగా ఉన్నందున అంబులెన్స్‌లను అధికారులు తిప్పికొడుతున్నారు. చైనాలోని జెజియాంగ్‌లో రోజుకు మిలియన్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలోని జెజియాంగ్, షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక ప్రావిన్స్‌లో దాదాపు మిలియన్ కొత్త కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో రెట్టింపు అవుతుందని చైనా వైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News