Cruise Ship: సిడ్నీ తీరంలో కరోనా కలకలం.. క్రూజ్ నౌకలో 800 మందికి కరోన పాజిటివ్

Cruise Ship: ప్రపంచవ్యాప్తంగా అదుపులోకి వచ్చిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ బుసలు కొట్టింది.

Update: 2022-11-12 15:00 GMT

Cruise Ship: సిడ్నీ తీరంలో కరోనా కలకలం.. క్రూజ్ నౌకలో 800 మందికి కరోన పాజిటివ్

Cruise Ship: ప్రపంచవ్యాప్తంగా అదుపులోకి వచ్చిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ బుసలు కొట్టింది. తాజాగా దాదాపు 800 మంది కరోనా బాధితులతో ఉన్న ఒక క్రూజ్ నౌక ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేయాల్సి వచ్చింది. అందులో 4 వేల 600 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన ఈ నౌక పేరు మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ క్రూజ్‌ షిప్‌. 12 రోజుల సముద్రయానంలో భాగంగా సగం ప్రయాణంలో భారీ ఎత్తున కేసులు వెలుగుచూడటం ప్రారంభమైందని క్రూజ్‌ ఆపరేటర్ కార్నివాల్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వైరస్ బారినపడిన కొందరిలో లక్షణాలు కనిపించడం లేదని ప్రకటించింది. మరికొందరిలో వ్యాధి తీవ్రత స్వల్ప స్థాయిలో ఉందని తెలిపింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌‌లో ఉంచారు. వైరస్ బాధితులకు తగిన సదుపాయాలు కల్పిస్తున్నారు.

Tags:    

Similar News