తమన్నాకి తెలుగులో కంటే తమిళంలో మంచి విజయాలున్నాయి. సూర్యతో చేసిన 'అయన్' (తెలుగులో 'వీడొక్కడే').. కార్తీతో చేసిన 'పయ్యా'(ఆవారా), 'సిరుత్తై'('విక్రమార్కుడు' రీమేక్), 'తోళా' (ఊపిరి).. అజిత్‌తో చేసిన 'వీరమ్' (వీరుడొక్కడే).. ధనుష్‌తో చేసిన 'పడిక్కాదవన్'.. విజయ్‌సేతుపతితో చేసిన 'ధర్మదురై' చిత్రాలు విజయం సాధించడంతో పాటు తమన్నాకి తమిళనాట మంచి పేరుని తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తున్న తమిళ చిత్రం 'స్కెచ్'. ఇందులో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. విక్రమ్‌తో తమన్నా జోడీ కట్టడం ఇదే తొలిసారి.
ఈ చిత్రంతో ఈ తరం తమిళ టాప్ హీరోల అందరి సరసన హీరోయిన్గా నటించినట్లవుతుంది తమన్నాకి. ఒక విజయ్‌ని మినహాయిస్తే.. సూర్య, అజిత్‌తో మంచి విజయాలను నమోదు చేసుకున్న క్రెడిట్ తమన్నాకి ఉంది. మరి విక్రమ్ విషయంలోనూ దాన్ని రిపీట్ చేస్తుందేమో చూడాలి. స్టిల్స్ లో ఈ కాంబినేషన్‌ని చూసి వారంతా జోడీ బాగుందంటున్నారు. డిసెంబర్లో రిలీజ్ కానున్న 'స్కెచ్'.. తెలుగులోనూ అనువాదం కానుంది. విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.