సెక్స్ రాకెట్ కేసులో సీనియర్ నటి సంగీత అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజులుగా ఓ రిసార్ట్ ను కేంద్రంగా చేసుకుని సెక్స్ రాకెట్ ముఠాను నిర్వహిస్తున్నారు ఆమె. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదుమేరకు వ్యభిచార స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో చాలామంది విటులతోపాటు కొంతమంది మహిళా జూనియర్ ఆర్టిస్ట్ లు పట్టుబడ్డారు. నటి సంగీత, ఆమె సన్నిహితుడు సురేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ధర్మాసనం వీరికి కస్టడీ విధించింది. ఈ ఘటనతో తమిళ సినీవర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా నటి సంగీత.. 'కరుప్పు రోజా' అనే తమిళ చిత్రంతో తెరంగ్రేటం చేశారు. అనంతరం పలుచిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమె కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నారు.