Nandyala: తస్మాత్ జాగ్రత్త.. తినాలనుకుంటే ముందుగా చూడండి!

Nandyala: నంద్యాల పట్టణంలోని శ్రీ నిధి ప్యూర్ వెజ్ హోటల్‌లో వడ్డించిన ఆహారంలో పురుగు కనిపించడం కలకలం రేపింది.

Update: 2026-04-01 08:02 GMT

Nandyala: తస్మాత్ జాగ్రత్త.. తినాలనుకుంటే ముందుగా చూడండి!

Nandyala: నంద్యాల పట్టణంలోని శ్రీ నిధి ప్యూర్ వెజ్ హోటల్‌లో ఆహారంలో పురుగు కనిపించడం కలకలం రేపింది. హోటల్‌లో భోజనం చేస్తున్న సమయంలో తమ ప్లేట్‌లో పురుగు కనిపించిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు హోటల్ యజమానులను ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

హోటల్ యజమానులు నిర్లక్ష్యంగా స్పందించారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరమణ, షేక్ కాసిం వలి సంఘటన స్థలానికి చేరుకుని హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు.

ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ. హోటల్ యజమానులు పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహారంపై ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News