Kovur: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. మాజీ సర్పంచులకు ఎమ్మెల్యే భరోసా

Kovur: కోవూరు నియోజకవర్గ సర్పంచుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారిని నెల్లూరులో ఘనంగా సత్కరించారు.

Update: 2026-04-01 09:13 GMT

Kovur: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. మాజీ సర్పంచులకు ఎమ్మెల్యే భరోసా

Kovur: గత ఐదు సంవత్సరాలలో సర్పంచులుగా ఎన్నికై ప్రజల మధ్య ఉన్న నాయకులకు, రేపటితో వాళ్ళ కాల పరిమితి ముగియనుంది. అందుకే వాళ్లని నెల్లూరు పార్లమెంట్ కార్యాలయానికి పిలిచి సన్మానం చేయడం జరిగిందని అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 47 మంది సర్పంచ్ లు ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని, 47 మంది కూడా , పదవీకాలం ముగియడంతో చాలా దిగులు పడుతున్నారని చెప్పారు.

ఒక గ్రామానికి ప్రథమ పౌరులుగా గెలిచి, గత మూడేళ్లలో తాము ఏ పని, గ్రామ ప్రజలకు గాని, మమ్మల్ని గెలిపించిన ప్రజలు కానీ చేయలేకపోయామని అంటున్నారని చెప్పారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 21 నెలలోనే మా గ్రామాల్లో అభివృద్ధి చేసుకోగలిగామని, మేమందరము మీతో కలిసి ఇంకో మూడు సంవత్సరాలు వుండి వుంటే బాగుండేది అని చెప్పారని తెలిపారు. రెండు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేశాం.

మూడు సంవత్సరాలు ఇంకా ఎంత చేసుండే వాళ్ళమో అని చెప్పి వాళ్ళందరూ బాధపడ్డారని చెప్పారు. ఇక్కడికి అందర్నీ పిలిచి ఈరోజు సర్పంచ్ లు అయితేనే గ్రామానికి నాయకులు కాదని, ప్రతి ఒక్కరు కూడా కాల పరిమితి ముగిసినా కూడా. గ్రామాల్లో నాయకత్వం వహించి ప్రజల సమస్యలు నా దగ్గరకు తీసుకురండి, నేను తప్పకుండా తీరుస్తాను అనే భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే. వాళ్ళందర్నీ సత్కరించడమే ఈరోజు ప్రధాన అంశంమని చెప్పారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , అలాగే లోకేష్ బాబు ఆధ్వర్యంలో పల్లెలు పట్టణాలుగా మారుతున్నాయని చెప్పారు.

తాము చెప్పిందే చేసి చూపిస్తున్నామని చెప్పారు. ఈరోజు దానికి నిదర్శనంగానే ఈ సర్పంచ్ లు అందరూ. మేము ఇంకా ఉంటే. ఇంకా కూడా మెరుగైన సేవలు అందించే వాళ్ళమని బాధపడుతూ వచ్చారని, దీనిని బట్టి కూటమి ప్రభుత్వ పరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎలా ఉందో తెలుసుకోవచ్చు అని చెప్పారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

Tags:    

Similar News