Kodumur: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. కోడుమూరు ఎమ్మెల్యే

Kodumur: కోడుమూరు మండలం కల్లపరిలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.

Update: 2026-04-01 10:41 GMT

Kodumur: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. కోడుమూరు ఎమ్మెల్యే 

Kodumur: కోడుమూరు మండలం కల్లపరిలో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపీణీ కార్యక్రమంలోఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. పించన్లు పంపీణీ అనంతరం గ్రామంలో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఎన్నికలో ఇచ్చిన మరో హామీ నెరవేరుస్తూ చేనేత కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని అన్నారు. చేనేత మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,04,488 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా కోడుమూరు పట్టణంలో పలువురు లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ సరఫరా లబ్ది ధ్రువీకరణ పత్రం ను ఎమ్మెల్యే అందజేశారు.చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు కి చేనేతలు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, టౌన్ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు,తదితరులు పాల్గొనారు.

Tags:    

Similar News