Polavaram: దళారుల చేతుల్లో గ్యాస్ బండలు.. సామాన్యులకు తప్పని తిప్పలు

Polavaram: ఏలూరు జిల్లా పోలవరంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

Update: 2026-04-01 10:58 GMT

Polavaram: దళారుల చేతుల్లో గ్యాస్ బండలు.. సామాన్యులకు తప్పని తిప్పలు

Polavaram: ఏలూరు జిల్లా పోలవరం అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావం భారత్ కు తాకింది ఇటు వంటగ్యాస్ లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతుంటే పోలవరంలో మాత్రం దళారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందు తూ ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని గ్యాస్ బండ రేటు 2000 నుండి 4000 వరకు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

నియంత్రించవలసిన అధికారులు నిమ్మక నీరు ఎత్తినట్టు ఉండడం పలు అనుమానాలకు దారితీస్తుంది గ్యాస్ బండను ఆన్లైన్లో బుక్ చేసుకున్న రాని గ్యాస్ బండ్లు దళారులు మాత్రం పదుల సంఖ్యలో నిల్వలు చేసుకోవడం వీరి ధైర్యానికి మెచ్చుకోవచ్చు యదేచ్ఛగా మెయిన్ రోడ్ లో దుకాణాల వద్ద గ్యాస్ బండ్లను అధిక రేట్లకు విక్రయించడం సర్వసాధారణమైపోయింది.

దీనివల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడుతున్నది పోలవరం ప్రజలకు ఒకపక్క మంచినీటి కష్టాలు మరోపక్క గ్యాస్ కష్టాలతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు అయినా అధికారులు గ్యాస్ దళారుల నిలువ దోపిడీ నుండి ప్రజలను కాపాడే యోచనలో లేనట్టు అనిపిస్తుంది ఇప్పటికైనా అధికారులు గ్యాస్ దళారులను నియంత్రించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News