Allagadda: నాడు ఒప్పే.. నేడు తప్పా? రాజధాని అంశంపై అఖిల ప్రియ

Allagadda: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అమరావతి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-04-01 08:18 GMT

Allagadda: నాడు ఒప్పే.. నేడు తప్పా? రాజధాని అంశంపై అఖిల ప్రియ

Allagadda: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రాజధాని అంశాన్ని చట్టబద్ధత చేయడం ప్రజలందరూ హర్షించదగిన విషయమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని అన్నారు.

రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చిన విషయం దేశంలోనే అరుదైన ఘటనగా అభివర్ణించారు. కేవలం 90 రోజుల వ్యవధిలోనే రైతులు భూములు ఇవ్వడం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ ప్రక్రియలో నారా చంద్రబాబు నాయుడు కృషి కీలకమని తెలిపారు.

వైసీపీ నాయకులు రైతులు భూములు ఇవ్వకుండా అడ్డుకునేందుకు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత చంద్రబాబు నిర్మించిన అసెంబ్లీలోనే కూర్చొని పాలన సాగించారని విమర్శించారు.

ప్రజలు రాజధాని అభివృద్ధి చేస్తారని ఆశించి ఓట్లు వేస్తే, జగన్ మోసం చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నవ్వుల పాలుచేశారని, రాయలసీమ, విశాఖ, అమరావతి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు.

రాజధాని తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు వైసీపీ నాయకులు ఎవరూ మాట్లాడలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకువచ్చింది చంద్రబాబేనని అన్నారు.

వైసీపీ నాయకులు రాజధాని పేరు అడిగితే ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు, అభివృద్ధి విషయాల్లో మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని భూమా అఖిల ప్రియ తేల్చిచెప్పారు.

Tags:    

Similar News