Tekkali: టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు సందడి
Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.
Tekkali: టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు సందడి
Tekkali: టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం కేంద్రంలోని హడ్కో కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.