పొరపాటున నోరు జారాను...క్షమించండి: ఎంపీ మురళీమోహన్

Update: 2018-06-23 09:54 GMT

‘వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అని పొరపాటుగా మాట్లాడినందుకు ఆయనను క్షమించు స్వామీ అని వేడుకున్నాను’ అని తెలిపారు టీడీపీ ఎంపీ మురళీమోహన్. ఈ ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ కావాలని నేను మాట్లాడలేదు. పొరపాటు జరిగింది అంతే. ఆ మాటను పట్టుకుని చాలా మంది సోషల్ మీడియాలో రచ్చ చేశారు. నా పొరపాటుకు చింతిస్తూ స్వామిని క్షమించమని వేడుకున్నాను ’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడికి కులాన్ని అంటగట్టే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో భక్తులంతా తనను క్షమించాలని ఎంపీ మురళీమోహన్ కోరారు. అలాగే వైసీపీ ఎంపీల రాజీనామాలపై స్పందిస్తూ చీకటి ఒప్పందలో భాగమే వైసీపీ ఎంపీ రాజీనామాలని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలకు అవకాశం లేకుండా రాజీనామాలను ఆమోదించారన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్‌ చేపట్టిన ఆమరణ దీక్షకు అందరం సంఘీభావం ప్రకటించామని ఎంపీ మురళీ మోహన్ తెలిపారు.

Similar News