CM Chandrababu: ఏపీలో రేపు, ఎల్లుండి సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
CM Chandrababu: ఏపీలో రేపు, ఎల్లుండి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు.
CM Chandrababu: ఏపీలో రేపు, ఎల్లుండి సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
CM Chandrababu: ఏపీలో రేపు, ఎల్లుండి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో CCLA ఉపన్యాసంతో కలెక్టర్ల సదస్సు ప్రారంభంకానుంది. అనంతరం, రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులు, ఉపముఖ్యమంత్రి పవన్, సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.
మొదటి రోజు GSDP లక్ష్యాలు, సూపర్ సిక్స్, పీ4 విధానంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల వారిగా ఈ ఫైల్స్ క్లియరెన్స్, పెట్టుబడులకు సంభందించి అంశంపై సీఎం చర్చించనున్నారు. రెండవ రోజు స్వర్ణాంధ్ర 2047, ఆదాయార్జన శాఖలపై, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.