పాఠశాల లైబ్రరీకి కంప్యూటర్లు ఇచ్చిన డిప్యూటీ సీఎం
చిలకలూరిపేటలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లైబ్రరీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో 25 కంప్యూటర్లను అందజేశారు.
చిలకలూరిపేట: చిలకలూరిపేటలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లైబ్రరీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో 25 కంప్యూటర్లను అందజేశారు. ఈ నెల 5న ఈ పాఠశాలలో జరిగిన టీచర్స్ -పేరెంట్స్ మీటింగుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా వచ్చారు. విద్యార్థులు అడగడంతోనే లైబ్రరీకి 25 కంప్యూటర్లను తన సొంత నిధులతో పంపిస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారం పది రోజులకే లైబ్రరీకి కావలసిన బుక్స్, 25 కంప్యూటర్లను డిప్యూటీ సీఎం పంపించారు.
శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ ను మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ, పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, ఆర్డీవో మధులత,మండల విద్యాశాఖ అధికారులు తాహశీల్దార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థినీవిద్యార్థులు తమ కోసం ఇంత చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.