CM Chandrababu: పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ హైకమాండ్ ఫోకస్
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సంస్థాగత నిర్మాణంపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది.
CM Chandrababu: పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ హైకమాండ్ ఫోకస్
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సంస్థాగత నిర్మాణంపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు త్రిసభ్య కమిటీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి కమిటీల ఎంపికపై జరుగుతున్న కసరత్తు దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో, ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సమావేశంలో ప్రధానంగా జిల్లా కమిటీల నియామకంపై చర్చ జరగనుంది. ఇప్పటికే వివిధ స్థాయిల నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న త్రిసభ్య కమిటీ, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక పదవుల కోసం రూపొందించిన జాబితాలపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి అధిష్టానం ఒక స్పష్టతకు రానుంది. సంస్థాగత నిర్మాణం పూర్తయితేనే ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లవచ్చని టీడీపీ భావిస్తోంది. ఈ సమావేశం ద్వారా పార్టీ సంస్థాగత బలోపేతానికి సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.