YS Jagan: భవానీపురం జోజీనగర్ బాధితుల వద్దకు వైఎస్ జగన్
YS Jagan: ఇవాళ విజయవాడ భవానీపురానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు.
YS Jagan: భవానీపురం జోజీనగర్ బాధితుల వద్దకు వైఎస్ జగన్
YS Jagan: ఇవాళ విజయవాడ భవానీపురానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో భవానీపురంలో 42 ప్లాట్లను అధికారులు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో జగన్ ను కలిసిన బాధితులు.. తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. దీంతో.. ఇవాళ విజయవాడలో జగన్ పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి భవానీపురానికి వెళ్లి.. 42 ఇళ్ల కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం.. బాధితులను ఆయన పరామర్శిస్తారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు 42 ప్లాట్ల బాధితులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు జగన్ కూడా వారిని కలుస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది.