CM Chandrababu: భూ కబ్జాదారులకు చంద్రబాబు వార్నింగ్: రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు.. ట్యాంపరింగ్ చేస్తే పీడీ యాక్టే!

CM Chandrababu: రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమికి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Update: 2026-02-06 11:21 GMT

CM Chandrababu: రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమికి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కలుగొట్లలో నిర్వహించిన 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ట్యాంపరింగ్‌కు తావులేదు!

గత ప్రభుత్వంలో భూముల రికార్డుల విషయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "మేం ఇప్పుడు ఇస్తున్న పాస్ పుస్తకాలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరు. క్యూఆర్ కోడ్, రాజముద్రతో అత్యంత భద్రతా ప్రమాణాలతో వీటిని రూపొందించాం. మీ భూమిపై ఎవరూ చేయి వేయకుండా పటిష్టమైన భద్రత కల్పించాం" అని ఆయన భరోసా ఇచ్చారు.

కబ్జా చేస్తే పీడీ యాక్ట్!

భూ ఆక్రమణదారుల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎవరి భూమినైనా కబ్జా చేయాలని చూస్తే వారిపై ఏకంగా పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి, 'భూ సమస్యలు లేని రాష్ట్రం'గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అప్పటి వరకు ప్రతి భూమికి భద్రత కల్పించే బాధ్యత తనదేనని రైతులకు హామీ ఇచ్చారు.

రైతుల ఆస్తి హక్కులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని, టెక్నాలజీని ఉపయోగించి రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని సీఎం వెల్లడించారు.

Tags:    

Similar News