భూమికి బలం.. రైతుకు లాభం అంపురంలో విత్తన శుద్ధి అద్భుతాలు

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో విత్తన గుళికల తయారీపై ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించారు.

Update: 2026-03-23 15:20 GMT

భూమికి బలం.. రైతుకు లాభం అంపురంలో విత్తన శుద్ధి అద్భుతాలు

కంచిలి/శ్రీకాకుళం: కంచిలి మండలం అంపురం యూనిట్ బలియాపుట్టుగ, అంపురం గ్రామాల్లో వాతావరణ పరిస్థితి దృష్ట్యా విత్తన గుళికల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తన గుళికల తయారీ విధానాన్ని రైతులకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వివరించారు. దీంతో కలిగే ఉపయోగాలను మాస్టర్ ట్రైనర్ శివానందం, వీఏఏ జీవిత వివరించారు. వీటి తయారీకి విత్తనాలు కందులు, గోరుచిక్కుడు, సజ్జలు, అనుములు, ఆముదము, ఘన జీవామృతం పొడి, బంకమట్టి పోడి, పోయి బూడిది, బీజామృతం, మంచినీరు, గోనిసంచి అవసరముంటుందని మాస్టర్ ట్రైనర్ శివానందం తెలిపారు.

ముందుగా గోనెసంచిపై విత్తనాలు వేసి బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలని చెప్పారు. మొదటి లేరుగా బంక మట్టిని, రెండో లేరుగా ఘనజీవామృతం, చివరి లేరుగా పోయి బూడిదను పట్టించాలని తెలిపారు. దీంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ విత్తనాలను చెడిపోకుండా చీమలు, పక్షులు సైతం దరిచేరవన్నారు. ఈ రకం విత్తనాల్ని విత్తన గుళికలు చేసి భూమిలో వేయడంతో ముందుగా విత్తనాలు మొలక శాతానికి సాధారణంగా వర్షపాతం 12 నుంచి 15 శాతం పడిన మొలక శాతం వస్తుందని అన్నారు.

అతి తక్కువ వర్షపాతంతో మొలకలు రావడానికి బాగా పనిచేస్తున్నాయన్నారు. ఈ విధంగా తయారు చేయడం. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువగా విత్తన గుళికలు చేసి పొలాల్లో వేసుకుంటే తక్కువ వర్షపాతమైనా మొలక శాతం వస్తుందని పేర్కొన్నారు. భూమి కప్పి ఉంచడం, రైతుకు ఆదాయంతో పాటు, వేసవిని తట్టుకునే రకాలు గోరుచిక్కుడు, కంది తక్కువ వర్షపాతంలోనూ పంటొస్తుందని చెప్పారు.

అనుములు వాతావరణంలోని తేమ శాతాన్ని తీసుకొని మొక్క పెరగడానికి ఆస్కారంగా ఉంటుందని, భూమిని కప్పి ఉంచుతుందని తెలిపారు. ఈ విధంగా కప్పి ఉంచడంతో భూమిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. సజ్జలు వేసవిని తట్టుకుని భూమిని గుళ్ల చేస్తాయని రైతులకు వివరించారు. ఈ విధముగా భూమికి, రైతులకు మేలు జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్పీ, రైతులు, లీడ్ ఫార్మర్స్ పాల్గొన్నారు.

Tags:    

Similar News