నీటి కోసం నిరసన.. ట్రాఫిక్ జామ్.. అధికారుల తీరుపై గ్రామస్తుల ఫైర్
రాజాం మండలం మొగిలివలసలో తాగునీటి సమస్యపై గ్రామస్తుల ఆగ్రహం. రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారిని దిగ్బంధించిన నిరసనకారులు.
నీటి కోసం నిరసన.. ట్రాఫిక్ జామ్.. అధికారుల తీరుపై గ్రామస్తుల ఫైర్
రాజాం/శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం మొగిలివలస గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సంక్షోభాన్ని యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన హరినాథ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారిని బారికేడ్లతో దిగ్బంధించారు.
దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హరినాథ్‌తో పాటు గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని సమసిపర్చారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.