Srikakulam: కళ్యాణి స్కూల్లో అమరవీరుల దినోత్సవం

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కవిటిలోని కళ్యాణి స్కూల్‌లో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతిని పురస్కరించుకుని అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.

Update: 2026-03-23 11:12 GMT

Srikakulam: కళ్యాణి స్కూల్లో అమరవీరుల దినోత్సవం

Srikakulam: కవిటి పట్టణంలోని కళ్యాణి స్కూల్ ఆవరణంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించి విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ పాత్రను ప్రిన్సిపాల్ బిందు మాధవి విద్యార్థులకు వివరించారు.

అనంతరం వీరి ముగ్గురు బ్రిటిష్ వారిని ఏ విధంగా గడగడలాడించారు.. వీరిని ఉరి తీయుటానికి కారణాలను ఉపాధ్యాయుడు సంతోష్ తెలియజేశారు. ఇటువంటి భారతీయ సంఘటనలో వీరు వీర మరణం పొందారని పీడీ బాలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News