Anantapur: సిగ్నల్ కోసం రైలు ఆగితే చాలు.. గుత్తిలో దొంగలు రెచ్చిపోతున్నారు!

Anantapur: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ అవుట్‌కట్స్‌లో తిరుచానూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఆగిన సమయంలో దొంగలు S5 కోచ్‌లోకి చొరబడి ఇద్దరు మహిళల గొలుసులను అపహరించారు.

Update: 2026-03-23 06:41 GMT

Anantapur: సిగ్నల్ కోసం రైలు ఆగితే చాలు.. గుత్తిలో దొంగలు రెచ్చిపోతున్నారు!

గుత్తి (అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రైలు అవుట్‌కట్స్‌లో ఆగడమే తరువాయి.. దొంగలు భోగీల్లోకి చొరబడి ప్రయాణికులను దోచుకుంటున్నారు. తాజాగా ఈరోజు ఉదయం తిరుచానూరు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలులో దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.

ఘటన వివరాలు:

తిరుచానూరు నుండి తిరుపతి వెళ్లే తిరుచానూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07017) రైలు ఈరోజు ఉదయం సుమారు మూడు గంటల ఆలస్యంగా నడుస్తోంది. తెల్లవారుజామున 4:50 గంటలకు గుత్తికి చేరుకోవాల్సిన ఈ రైలు, ఉదయం 8:33 గంటల ప్రాంతంలో గుత్తి రైల్వే స్టేషన్ అవుట్‌కట్స్‌కు చేరుకుంది. అక్కడ సిగ్నల్ కోసం సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది.

S5 కోచ్‌లో దుండగుల హల్చల్:

రైలు నిలిచి ఉండటాన్ని గమనించిన దొంగలు, పట్టపగలే సాహసించి S5 భోగీలోకి చొరబడ్డారు. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను తెంచుకుని పరారయ్యారు. బాధితులు తేరుకుని ఫిర్యాదు చేసేలోపే రైలు స్టేషన్ నుండి కదలడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

పోలీసుల విచారణ:

అవుట్‌కట్స్‌లో రైళ్లు ఆగినప్పుడు భద్రత కరువవ్వడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. అపహరణకు గురైన బంగారం విలువ ఎంత అనేది పోలీసుల పూర్తిస్థాయి విచారణలో తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై నిఘా పెట్టి నిందితులను పట్టుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News