Tekkali: రాత్రి వేళల్లో రోడ్డుపై కనిపిస్తే అంతే.. కొత్త రూల్స్ ఇవే!

Tekkali: టెక్కలి సబ్ డివిజన్ లో రాత్రి 11 గంటల తర్వాత ధాబాలు, హోటళ్లు మూసివేయాలని డీఎస్పీ లక్ష్మణరావు ఆదేశించారు.

Update: 2026-03-23 13:48 GMT

Tekkali: రాత్రి వేళల్లో రోడ్డుపై కనిపిస్తే అంతే.. కొత్త రూల్స్ ఇవే!

టెక్కలి/శ్రీకాకుళం: జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం దృష్ట్యా,రాత్రి వేళల్లో అనవసర గుంపులు, అశాంతి పరిస్థితులు మరియు నేరాలకు దారితీసే అవకాశాలను నివారించేందుకు ధాబాల నిర్వహణపై టెక్కలి డీఎస్పీ డి లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. టెక్కలి సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ధాబాల యజమానులు ప్రతిరోజూ రాత్రి 11:00 గంటల లోపు తమ ధాబాలను తప్పనిసరిగా మూసివేయాలి.

అనుమతి లేకుండా రాత్రి ఆలస్యంగా ధాబాలను నిర్వహించడం, కస్టమర్లను అనుమతించడం చట్టపరమైన చర్యలకు గురికావచ్చు.రాత్రి 11 గంటల తర్వాత టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు తెరిచి ఉంచరాదని,ప్రతిరోజు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా, రాత్రి 11 గంటల తర్వాత ఎటువంటి అత్యవసర కారణం లేకుండా ప్రజలు అనవసరంగా సంచరించరాదు. రాత్రి వేళల్లో సినిమాలకు వెళ్లిన వ్యక్తులు తిరుగు ప్రయాణంలో సినిమా టికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ధాబాల వద్ద మద్యం క్రయ విక్రయాలు,సేవించడం, మాదక ద్రవ్యాల వినియోగం, అనవసర గుంపులు చేరడం, శబ్ద కాలుష్యం సృష్టించడం వంటి కార్యకలాపాలను కఠినంగా నిషేధించడమైనది.

ధాబాల యజమానులు తమ ప్రాంగణంలో ఇలాంటి అక్రమ చర్యలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి,సిబ్బంది వివరాలను నమోదు చేయాలన్నారు.అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ లక్ష్మణ రావు హెచ్చరించారు.

Tags:    

Similar News