Nandyala: నంద్యాల లో ఫుడ్ పాయిజన్ కలకలం!!
Nandyala: నంద్యాల వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం. పెళ్లి భోజనం తిని వంద మందికి పైగా అస్వస్థత.
Nandyala: నంద్యాల లో ఫుడ్ పాయిజన్ కలకలం!!
Nandyala: నంద్యాల శివారు ప్రాంతంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న బుడగ జంగాల ప్రజలకు నిత్యం ఎవరో ఒకరు ఆహారాన్ని అందిస్తూ ఉంటారు ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ పెళ్లి వేడుకలు మిగిలిన పులిహోర ఇతర ఆహార పదార్థాలను బుడగ జంగాల ప్రజలకు అందించారు.. వాటిని తిన్న ప్రజలు నిన్నటి నుండి వాంతులు విరోచనాలు జ్వరాలతో ఇబ్బంది పడుతూన్నారు.
వాంతులు విరోచనాలతో కొందరు ప్రైవేట్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.. ముగ్గురు పరిస్థితి విషమం ఐసీయూలో చికిత్స స్థానికంగా ఇంటివద్దె 20 మందికి పైగా సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటు చికిత్స అందిస్తున్న వైద్య బృందం..
ఫుడ్ పాయిజన్ ఘటన తెలుసుకుని హుటాహుటిన మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్యాధికారి DMHO వెంకటరమణ, వైద్య సిబ్బంది బుడగ జంగాల కాలనీకి చేరుకొని అనారోగ్యంగా ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ కు కారణం బయట వ్యక్తులు ఇచ్చిన ఆహారమా, లేక నీటి అపరిశుభ్రం వలన అనే విషయం అధికారుల పరీక్షలలో తెలియాల్సి ఉంది.
సుమారు వంద మందికి పైగా అనారోగ్యంతో ఇబ్బంది పడినట్లు స్థానికులు తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి.