Tirumala: టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

New TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు.

Update: 2026-02-06 10:01 GMT

New TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. ఈఓగా బాధ్యతలు స్వీకరించే ముందు క్షేత్ర ఆచారం ప్రకారం భూవరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలో స్వామివారి సమక్షంలో టీటీడీ ఈవోగా ప్రమాణ స్వీకారం చేశారు రవిచంద్ర. రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు రవిచంద్రకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు రవిచంద్ర. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News