యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్, నాగబాబు కుమార్తె నిహారిక కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కార్య తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించనున్నాయి. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించనున్నారు. 'హ్యాపీ వెడ్డింగ్' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ 'హ్యాపీ వెడ్డింగ్'లో నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్, తులసి, నిరోషా ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. 'అంతకుముందు ఆ తరువాత', 'లవర్స్' చిత్రాల తరువాత సరైన హిట్ లేని సుమంత్‌కి ఈ సినిమా విజయం కీలకంగా మారింది. అలాగే 'ఒక మనసు' అంటూ ఎంట్రీ ఇచ్చి నిరాశపడిన నిహారికకి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. చూద్దాం.. ఈ ఇద్దరికి 'హ్యాపీ వెడ్డింగ్' హ్యాపీ రిజల్ట్‌ని ఇస్తుందేమో!