మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం అంటే.. అది 'మగధీర' సినిమానే. చరణ్ హీరోగా నటించిన రెండో సినిమా ఇది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాత రికార్డులన్నింటిని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.'మగధీర' తరువాత చరణ్ కెరీర్లో విజయాలైతే ఉన్నాయి కానీ.. అవి 'మగధీర' స్థాయికి చాలా దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న 'రంగస్థలం'.. సెంటిమెంట్ ప్రకారం 'మగధీర' రేంజ్ హిట్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు పరిశీలకులు.
అదెలాగంటే.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఏడో చిత్రం 'మగధీర' అయితే.. సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ఏడో చిత్రం 'రంగస్థలం'. ఇలా రామ్ చరణ్ తో ఏడో చిత్రాలను తెరకెక్కించిన దర్శకులలో రాజమౌళి తర్వాత ఆ స్థానం మళ్లీ సుకుమార్ కే దక్కింది. మరి సెంటిమెంట్ వర్కవుట్ అయితే.. 'మగధీర' స్థాయి విజయం రామ్‌చరణ్‌కి దక్కే ఛాన్స్ ఉందన్నమాట.