అక్కినేని నాగార్జున మెంటలిస్ట్‌గా, సమంత ఆత్మగా నటిస్తున్న చిత్రం 'రాజుగారి గది2'. 'రాజుగారి గది'తో సంచలన విజయం సొంతం చేసుకున్న ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా మలయాళంలో విజయవంతమైన 'ప్రేతమ్' చిత్రానికి కాపీగా తెరకెక్కుతోందంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయమై దర్శకుడు ఓంకార్‌ని సంప్రదిస్తే.. కాపీ కాదు ఇది రీమేక్ అని ఓ ఛానల్‌కి చెప్పుకొచ్చారట. 'ప్రేతమ్' ట్రైలర్, 'రాజుగారి గది2' ట్రైలర్ ఇంచుమించుగా ఒకేలా ఉండడంతో రీమేక్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.