మమ్మల్ని గన్స్‌తో రౌండప్‌ చేశారు: ఎమ్మెల్యే డ్రైవర్‌

Update: 2018-09-24 05:19 GMT

అరకులో ఇద్దరు ప్రజాప్రతినిధులు మావోల చేతిలో దారుణంగా హతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న శివేరి సోమ డ్రైవర్ చిట్టిబాబు సంఘటన జరిగిన తీరును మీడియాకు వివరించాడు. తమని తుపాకులతో రౌండప్‌ చేసి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దూరంగా తీసుకెళ్లి మావోయిస్టుల కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము కారు డ్రైవర్‌ కే చిట్టిబాబు మీడియాకు తెలిపారు. సిబ్బంది నుంచి ఆయుధాలను తీసుకున్న తర్వాత అందరినీ బందించారని సర్వేశ్వరరావును, సోమాను అక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకుపోయారని సోమా డ్రైవర్ తెలిపాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తే కాల్చిపారేస్తామని మా దగ్గర కాపలా ఉన్నవారు బెదిరించినట్లు చిట్టిబాబు పేర్కొన్నారు. అనంతరం వారిపై జరిపిన కాల్పులు శబ్దం వినబడ్డాక మమ్మల్ని వదిలేసారని, వారెన్ని అక్రమాలు చేశారో తెలుసా అని తమను ప్రశ్నించారని చిట్టిబాబు చెప్పారు.

Similar News