అసెంబ్లీలో మహేష్‌బాబుకి ఏం పనా? అనుకుంటున్నారా? అయితే ఇక్కడ అసెంబ్లీ అంటే నిజమైన అసెంబ్లీ కాదులెండి. సెట్టింగ్ అన్నమాట. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్.. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీగా నిర్మించిన అసెంబ్లీ సెట్లో జరుగుతోంది. డి.వి.వి.దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్గా నటిస్తోంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారని వార్తలు వినిపించాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం మార్చి 30న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మహేష్ తాజా చిత్రం 'స్పైడర్' ఈ నెల 27న విడుదలకు సిద్ధమౌతోంది.