మామయ్య ఆదేశిస్తే ఎన్నికల్లో పాల్గొంటా : సాయుధరమ్‌తేజ్

Update: 2018-06-02 03:20 GMT

సినిమాల్లోకి వచ్చి అనతికాలంలోనే  తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సాయుధరమ్‌తేజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోగా మంచి క్రేజ్ సంపాదించాడు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హీరోయిన్‌ కేథరిన్‌తో కలిసి శుక్రవారం వచ్చారు. ఈ సందర్బంగా తన మామయ్య  పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తాను నటించిన ‘తేజ్‌.. ఐ లవ్‌ యు’ సినిమా ఈ నెల 29న విడుదలవుతుందని సినిమా తప్పకకుండా ఘనవిజయం సాధిస్తుందన్నారు సాయుధరమ్‌తేజ్ 

Similar News