దర్శకుడిగా త్రివిక్రమ్ వయసు 8 సినిమాలు. ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో సింహభాగం విజయాలే ఉన్నాయి. ప్రస్తుతం తన తొమ్మిదో చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిస్తున్నాడీ మాటల మాంత్రికుడు. 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి విడుదల తేదిని మాత్రం జనవరి 10గా ఖాయం చేశారు. విశేషమేమిటంటే.. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఏ చిత్రం కూడా సంక్రాంతి సీజన్లో విడుదల కాలేదు. పవన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంతోనే మొదటిసారిగా సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు త్రివిక్రమ్. సంక్రాంతిని టార్గెట్ చేసుకుని వస్తున్న త్రివిక్రమ్ మొదటి ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.