ఆలేరులో పాడి రైతుల ధర్నా

Update: 2018-10-22 11:07 GMT

నల్గొండ జిల్లా ఆలేరులో పాడిరైతులు ఆందోళన బాట పట్టారు. పాలధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. నిత్యావాసరాలతోపాటు పాడి పోషణ పెరిగాయని అయినా పాల ధరలను మాత్రం పెంచడం లేదని రైతులు మండిపడుతున్నారు. మదర్ డెయిరీలో పాలు పోసే రైతులకు, పాల రేటు పెంచాలని కోరుతూ ఆలేరు రైల్వే గేటు వద్ద ధర్నా పాడి రైతులు ధర్నా చేపట్టారు. మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలు పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. రోడ్డుపై రైతులో ఆందోళతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరంగల్ -హైదరాబాద్ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. 
 

Similar News