తెలుగులోనే కాదు తమిళంలోనూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది చెన్నై చిన్నది సమంత. ఇక్కడలాగే తమిళంలోనూ స్టార్ హీరోలతో ఆడిపాడిందీ ముద్దుగుమ్మ. ఇక తమిళ స్టార్ హీరో విజయ్‌తో ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తోంది సమంత. 'మెర్సల్' పేరుతో రూపొందుతున్న ఆ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో 'కత్తి', 'తెరి' చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్నే నమోదు చేసుకున్నాయి.
విశేషమేమిటంటే.. విజయ్‌తో మొదటి సారిగా కలిసి నటించిన 'కత్తి'లో సమంత మాత్రమే హీరోయిన్ అయితే.. రెండోసారి జోడీ కట్టిన 'తెరి'లో తనతో పాటు ఎమీ జాక్సన్ కూడా మరో హీరోయిన్గా నటించింది. ఇక 'మెర్సల్' లో అయితే ఆ సంఖ్య మూడుకి చేరింది. ఇందులో సమంతతో పాటు కాజల్, నిత్యా మీనన్ కూడా హీరోయిన్స్‌గా నటించారు. మొత్తానికి.. సమంతకి విజయ్‌తో నటించే సందర్భంలో సినిమాకో అనుభవం ఎదురవుతోందన్నమాట.