హ్యాపీ న్యూఇయర్‌ అంటే గుంజీలు తీయిస్తా..

Update: 2017-12-25 12:17 GMT

జనవరి ఒకటో తేదీ నాడు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్‌ అంటే గుంజీలు తీయిస్తా.. ఈ మాటలు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్య రాజన్‌ అన్నారు. నూతన సంవత్సరమంటే ఉగాది అని, జనవరి ఫస్ట్‌ ఇంగ్లీషు వారి సంవత్సరాది అని అన్నారు. డిసెంబర్‌ 31న యువత తాగి, డ్యాన్సులు చేసి తెల్లారి గుళ్లకి వచ్చి హ్యాపీ న్యూయర్‌ అంటే ఒప్పుకోమన్నారు. 

జనవరి ఫస్ట్‌న హిందూ ఆలయాల్లో ఎలాంటి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబోమన్నారు సౌందర్య రాజన్‌. ప్రభుత్వం అలాంటి సర్కులర్‌ విడుదల చేయడం మంచిదేన్నారు. డిసెంబర్‌ 29న వైకుంఠ ఏకాదశి వస్తోందని ఆ రోజు భక్తులంతా వెంకటేశ నామ స్మరణ చేయాలన్నారు. 

భక్తులు ఎవరైనా జనవరి ఒకటి నాడు హ్యాపీ ఇంగ్లీషు న్యూ ఇయర్‌ అంటే అభ్యంతరం లేదని, అయితే హ్యాపీ న్యూఇయర్‌ అంటే మాత్రం గుంజీలు తీయించడం గ్యారెంటీ అని సౌందర్య రాజన్‌ హెచ్చరించారు. జనవరి ఒకటి హిందూ పండగ కానే కాదని ఆలయ ప్రాంగణంలో సౌందర్య రాజన్‌ మైకు పట్టుకొని మరీ ప్రకటించారు. 

Similar News