గతేడాది వేసవికి విడుదలైన తమిళ అనువాద చిత్రం 'బిచ్చగాడు' సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శశి దర్శకత్వంలో సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలో 'పిచ్చైక్కారన్' పేరుతో రూపొందింది. అక్కడా మంచి విజయం సాధించింది. 'బిచ్చగాడు' తరువాత విజయ్ ఆంటోని హీరోగా రెండు సినిమాలు వచ్చాయి. మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయినప్పటికీ దర్శకుడు శశి కొత్త చిత్రం ఇంకా సెట్స్ పైకి రాకపోవడం గమనార్హం.
తమిళనాట వినిపిస్తున్న కథనాల ప్రకారం.. అతి త్వరలో శశి కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. ఇందులో యువ కథానాయకులు సిద్ధార్థ్, జి.వి.ప్రకాష్ నటించనున్నారని.. దీనికి 'రెట్టై కొంబు' అనే పేరు పరిశీలిస్తున్నారని తెలిసింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతమందించే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. అన్నట్టు.. గతంలో వెంకటేష్ హీరోగా వచ్చిన 'శీను' చిత్రాన్ని కూడా తెరకెక్కించింది ఈ శశినే.