తనకు బ్లడ్ కాన్సర్ ఉందన్న వార్తపై నటి రాధికా ఏమన్నారంటే!

Update: 2018-05-22 11:02 GMT

సోషల్  మీడియాలో ఏది మంచో ఏది చెడో అర్ధం కాక సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం అవాక్కవుతున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలపై మరీ ఘోరంగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించిన నటీమణి రాధిక గురించి సోషల్ మీడియాలో ఓ వార్త దావానంలా  వ్యాపించింది. ఆమెకు బ్లడ్ కాన్సర్ ఉన్నట్టు ప్రస్తుతం ఆమె ప్రమాదంలో ఉన్నారని దాని సారాంశం..  ఇక ఇదే వార్తలపై ఓ అభిమాని రాధికకు ట్వీట్ చేశాడు. ఆమె దానికి స్పందిస్తూ.. ‘అది నిజం కాదు.. కల్పితం’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో ఆ వైరల్ వార్తకు బ్రేక్ పడింది. 

Similar News