ఏసీబీకి చిక్కిన మహబూబ్‌నగర్ డిప్యూటీ తహసీల్దార్

Update: 2018-05-05 10:00 GMT

అవకతవకలకు పాల్పడిన రేషన్‌ డీలర్ల నుంచి లంచం తీసుకుంటూ ఓ డిప్యూటీ తహసీల్దారు ఏసీబీకి పట్టుబడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్న కృష్ణమోహన్‌... మద్దూరు, గండేడ్‌, దామరగిద్ద మండలాలకు సైతం ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గండేడ్‌ మండల పరిధిలోని 34 రేషన్‌ షాపుల్లో 260 క్వింటాళ్ల బియ్యానికి సంబంధించి ఆవకతవకల నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వకుండా ఉండేందుకు 7లక్షలు లంచం ఇవ్వాల్సిందిగా డీలర్లను డిమాండ్‌ చేశారు. చర్చల అనంతరం వారు 5లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కృష్ణమోహన్‌కు లంచం ఇవ్వడం ఇష్టంలేని సదరు డీలర్లు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఆయన ఇంట్లో డీలర్ల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా  పట్టుకున్నారు. 

Similar News