Petrol Price Today: తగ్గిన పెట్రోల్ ధరలు

Update: 2019-10-15 04:05 GMT

రెండోరోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 6 పైసలు, డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్ ధర 77.91రూపాయలకు, డీజిల్ ధర రూ.72.42రూపాయలకు దిగి వచ్చాయి.

ఇక అమరావతిలో లీటరు పెట్రోల్ ధర 6 పైసలు, డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్‌ ధర  77.52 రూపాయలు,  డీజిల్‌ ధర 71.70 రూపయలుగానూ ఉంది.  ఇక విజయవాడలో లీటరు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు తగ్గింది. దీంతోపెట్రోల్ ధర 77.16, డీజిల్ ధర 71.35 రూపాయలకు తగ్గింది. 

దేశ రాజధాని ఢిల్లీలో కూడా లీటరు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర 73.27 రూపాయలు ఉండగా డీజిల్ ధర కూడా 69.61 రూపాయలుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్ ధర 78.88 రూపయలుగానూ, డీజిల్ ధర 69.61 రూపాయలుగానూ ఉంది.


Tags:    

Similar News