మహిళల్లో ఆ క్యాన్సర్‌కు కారణమవుతోన్న స్మోకింగ్‌.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల వ్యాధులకు ధూమపానం కారణమవుతుంది.

Update: 2025-01-22 16:01 GMT

మహిళల్లో ఆ క్యాన్సర్‌కు కారణమవుతోన్న స్మోకింగ్‌.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల వ్యాధులకు ధూమపానం కారణమవుతుంది. సాధారణంగా ధూమపానం కారణంగా లంగ్‌ క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని భావిస్తాం. కానీ మహిళల్లో స్మోకింగ్‌ మరో సమస్యకు కూడా కారణమవుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.స్మోకింగ్ కారణంగా మహిళల్లో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ధూమపానం కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని, ఇది శరీరంలోని కణాలకు నష్టం కలిగిస్తుందని అంటున్నారు. ఇది అండాశయ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. స్మోకింగ్ కారణంగా హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌కు కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పొగాకుకు దూరంగా ఉండే మహిళలతో పోల్చితే.. బీడీలు, సిగరెట్లు, హుక్కా వంటివి తీసుకునే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ధూమపానం అండాశయాలతోపాటు రోగనిరోధక శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం HPV సంక్రమణతో పోరాడే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని, సెల్యులార్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. పొగాకులోని నికొటిన్‌ క్యాన్సర్‌ కారకాలు రక్తప్రవాహంతో పాటు గర్భాశయ శ్లేష్మంలోకి ప్రవేశిస్తాయి. దీని కారణంగా గర్భాశయ కణాలు దెబ్బతింటాయి. ఇది గర్భాశయ కణజాలాన్ని బలహీనపరుస్తుంది.

ధూమపానం రూపంలో పొగాకు వాడకం మహిళ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. గర్భాశయ క్యాన్సర్‌కు గల కారణాలలో ఒకటి అయిన HPV ఇన్‌ఫెక్షన్‌తో వ్యవహరించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. పొగాకు మానేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కోలుకోవడానికి సహాయపడుతుంది, ఇది గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొగాకులో నికోటిన్, బెంజీన్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇది గర్భాశయ కణాలను అలాగే డీఎన్‌ఏను దెబ్బ తీస్తుంది.

పొగాకు అలవాటును మానుకోవడం ద్వారా మహిళలు తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు, హానికరమైన రసాయనాలకు గురికావడాన్ని తగ్గించవచ్చు. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గర్భాశయ క్యాన్సర్‌ను దూరంగా ఉంచడానికి మహిళలు పాప్ స్మెర్స్, హెచ్‌పివి వ్యాక్సినేషన్‌ను కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక స్మోకింగ్ చేసే వారికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News